- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందేమాతరం పాడాల్సిందే.. బెంగాల్ సర్కార్ కీలక ఆదేశాలు
బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్కూళ్లలో ఉదయం వేళ వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్కూళ్లలో ఉదయం వేళ వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం స్కూల్ ప్రారంభం సమయంలోనే ప్రతి విద్యార్థి జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని, ప్రధానోపాధ్యాయుడు ఇది అమలు అయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన సైత విడుదల చేసింది. మరోవైపు సీఎం సువేందు అధికారి కూడా ప్రకటించారు. ఈ ఆదేశాలతో మే 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో వందేమాతరం ఆలపించానున్నారు.
అయితే గతంలోనూ స్కూళ్లలో జాతీయ గీతం జనగణమన మాత్రమే పాడేవాళ్లు. కానీ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత 1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమ సమయంలో ఠాగూర్ రాసిన బంగ్లార్ మాటి బంగ్లార్ జోల్ పాటను రాష్ట్రగతంగా ప్రవేశపెట్టారు. ఆనాటి నుండి జాతీయగీతం జనగనమన పాడకుండా బంగ్లాదేశ్ రాష్ట్రగీతమే పాడుతున్నారు. తాజా ఆదేశాలతో స్కూళ్లలో మరోసారి జనగనమన వినిపించనుంది. దీంతో పాటు రాష్ట్రీయ గీతాన్ని సైతం విద్యార్థులు ఆలపిస్తారు. అయితే రాష్ట్రగీతం, జాతీయగీతం రెండు పాడాల్సిరావడతో ఇప్పుడు టీచర్లకు తలనొప్పిగా మారింది. రెంటు గీతాలు పాడేందుకు సమయం సరిపోతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు.






