- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల హింస కేసులో సంచలన పరిణామం.. న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
బెంగాల్ ఎన్నికల అనంతర హింస కేసులో వాదించేందుకు మాజీ సీఎం మమతా బెనర్జీ గురువారం లాయర్ గౌను ధరించి కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల హింస కేసు (Election violence case) నేపథ్యంలో కలకత్తా హైకోర్టు (Calcutta High Court) కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు. ఎన్నికల అనంతర హింస, తమ పార్టీ కార్యాలయం పై దాడులకు సంబంధించిన కేసులో వాదనలు వినిపించడానికి ఆమె న్యాయవాది దుస్తుల్లో (Gown) కోర్టుకు రావడం విశేషం. అనంతరం కోర్టులో జడ్జి ముందు టీఎంసీ (TMC) పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులో ఆమె వాదనలు వినిపించారు. ఈ వాదనలకు ముందు ఆమె లాయర్ కోర్టులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో మాజీ సీఎం మమతా బెనర్జీ వెంట సీనియర్ టీఎంసీ నాయకులు చంద్రిమా భట్టాచార్య, కళ్యాణ్ బెనర్జీలు ఉన్నారు.
వందేమాతరం పాడాల్సిందే.. బెంగాల్ సర్కార్ కీలక ఆదేశాలు
Next Story






