- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
“ఉద్యోగానికి భూమి కుంభకోణం” కేసులో కీలక పరిణామం
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ మరియు ఇతరులపై ఉద్యోగాలకు భూమి కేసులో అభియోగంపై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగానికి భూమి కుంభకోణం (Land for Jobs scam) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue Court)లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా పలువురిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ జరిగింది. చార్జిషీట్‌ను పరిశీలించిన కోర్టు అభియోగాలపై ఉత్తర్వులను రిజర్వ్ (Orders reserved.) చేసింది . 2025 అక్టోబర్ 13న ఈ కేసులో తీర్పు వెలువడనుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో, రైల్వేలో ఉద్యోగాల నియామకాలకు ప్రతిఫలంగా బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో భూములను తన కుటుంబ సభ్యుల పేర్లకు బదలాయింపులు చేయించుకున్నారని సీబీఐ (CBI) ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సీబీఐ విస్తృత దర్యాప్తు జరిపి, లాలూ కుటుంబ సభ్యులు సహా అనేక మందిపై కేసులు నమోదు చేసింది.
కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేయడంతో, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఒకవేళ ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులు దోషులుగా రుజువైతే వారి రాజకీయ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అలాగే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీతో పాటు ఇండియా కూటమి పరిస్థితులపై కూడా ఈ కేసు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More..






