మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ

by Malleboina Mahesh |   (  Updated:2025-09-11 07:16:00  IST  )

మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాన్ని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాన్ని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. వంచన, తప్పుడు పత్రాల కేసులో వాంటెట్ నేరస్తుడిగా మారిన మునవర్ ఖాన్‌ (Munawar Khan)ను సీబీఐ కువైట్‌ నుంచి భారత్‌కు విజయవంతంగా తీసుకొచ్చింది. ఇంటర్‌పోల్ ఛానెల్స్ ద్వారా జరిగిన ఈ చర్యలో సీబీఐలోని ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ యూనిట్‌ (IPCU), భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), అలాగే NCB-కువైట్ కలిసి పనిచేశాయి. సీబీఐ ఇప్పటికే మునవర్ ఖాన్‌పై రెడ్ నోటీస్ జారీ చేయగా, అతడి కోసం పలు నెలలుగా ప్రయత్నాలు చేసింది.

చివరికి సెప్టెంబర్ 11న ఈ రోజు కువైట్ పోలీసుల బృందం అతడిని ఎస్కార్ట్ చేస్తూ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)కి తీసుకువచ్చింది. అక్కడ సీబీఐ స్పెషల్ టాస్క్ బ్రాంచ్‌ (STB), చెన్నై బృందం అతడిని కస్టడీలోకి తీసుకుంది. మునవర్ ఖాన్‌పై నకిలీ పత్రాల సృష్టి, మోసం ఆరోపణలు ఉండగా, ఈ కేసులో అతని అరెస్ట్‌తో సీబీఐ దర్యాప్తుకు మరింత వేగం అందనుంది. అంతర్జాతీయ స్థాయిలో సహకారంతో నేరస్థులను భారత్‌కు తీసుకువచ్చే విషయంలో ఈ చర్య సీబీఐ ధృఢ సంకల్పానికి మరో నిదర్శనంగా నిలిచింది.

Read More..

“ఉద్యోగానికి భూమి కుంభకోణం” కేసులో కీలక పరిణామం

Next Story