- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక SSLC ఫలితాలు విడుదల: ఈ ఏడాది 94.10 శాతం ఉత్తీర్ణత
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటక SSLC-2026 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (KSEAB) ఇవాళ 10వ తరగతి (SSLC) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. సుమారు 8.65 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది అత్యధికంగా 94.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 8.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. మొత్తం 94.10 శాతం మంది విద్యార్థులు పైతరగతులకు అర్హత సాధించారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను బోర్డు ఉత్తీర్ణులుగా ప్రకటించింది. విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజిలాకర్ (DigiLocker) లో కూడా చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి karresults.nic.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం బోర్డు త్వరలోనే సప్లిమెంటరీ (Supplementary) పరీక్షలను నిర్వహించనుంది. అందుకు సంబంధించిన దరఖాస్తు గడువు, పరీక్ష తేదీలను ఒకటి రెండు రోజుల్లో బోర్డు వెల్లడిస్తుంది.






