సీబీఎస్‌ఈ 2026 పరీక్షల రెండో విడత షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 07:59:27  IST  )

CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షలు 2026 మే 15 నుండి ప్రారంభం కానున్నాయి. మార్కులు పెంచుకోవాలనుకునే వారికి మరియు కంపార్ట్‌మెంట్ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.

సీబీఎస్‌ఈ 2026 పరీక్షల రెండో విడత షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: CBSE పదవ తరగతి రెండో విడత (Phase 2) బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు బోర్డు ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం ప్రకారం, ఇంప్రూవ్‌మెంట్, కంపార్ట్‌మెంట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. మే 15 నుంచి ప్రారంభమై మే 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎవరు అర్హులు

ఫిబ్రవరి/మార్చిలో జరిగిన మొదటి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులై, తమ మార్కులను మెరుగు పరచు కావాలనుకునే విద్యార్థులు (గరిష్టంగా మూడు సబ్జెక్టుల వరకు). కంపార్ట్‌మెంట్ కేటగిరీలో నిలిచిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 320 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండో విడత పరీక్షలు జూన్ మొదటి వారంతో ముగుస్తాయి. ఫలితాలు జూన్ ఆఖరు లేదా జూలై మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులు అదే ఏడాది ఉన్నత విద్యకు (11వ తరగతి) ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఆటంకం కలగదు.

పరీక్షల పూర్తి షెడ్యూల్..


నేడు EAPCET హాల్ టికెట్ల విడుదల

Next Story