నేడు EAPCET హాల్ టికెట్ల విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2026-04-23 08:00:55  IST  )

తెలంగాణ EAPCET 2026 అభ్యర్థులు నేటి నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

నేడు EAPCET హాల్ టికెట్ల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఎంసెట్ (TG EAPCET) 2026 అభ్యర్థులకు కీలక అప్‌డేట్. నేటి నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను బుధవారం ఉదయం 11 గంటల నుంచి వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చునని పేర్కొంది. అయితే అగ్రికల్చర్ & ఫార్మసీ (A & P) హాల్ టికెట్లు నేటి నుండి అందుబాటులో ఉండగా.. ఈ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. అలాగే ఇంజినీరింగ్ (E) స్ట్రీమ్ అభ్యర్థులకు హాల్ టికెట్లు ఏప్రిల్ 27న విడుదల కానుండగా పరీక్షలు మే 9, 10 మరియు 11 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సీబీఎస్‌ఈ 2026 పరీక్షల రెండో విడత షెడ్యూల్ విడుదల

Next Story