Karnataka: ఒక్కొక్కటిగా వెలుగులోకి ఐపీఎస్ రాసలీలలు.. మహిళతో ఆడియో రొమాన్స్ లీక్

by Prasad Jukanti |   (  Updated:2026-01-20 10:06:47  IST  )

కర్ణాటకలో డీజీపీ స్థాయి ఆఫీసర్ రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

Karnataka: ఒక్కొక్కటిగా వెలుగులోకి ఐపీఎస్ రాసలీలలు.. మహిళతో ఆడియో రొమాన్స్ లీక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు రాసలీలల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తన ఆఫీసులోనే పోలీసు డ్రెస్‍లో మహిళలతో రామచంద్రరావు సరసాలాడిన వీడియోలు బహిర్గతం కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోల వ్యవహారం వైరల్ అయిన కొన్ని గంటల్లోనే ఓ మహిళతో ఫోన్‍లో సరసంగా మాట్లాడిన ఆడియా క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్ కూడా రామచంద్రరావుదేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో సదరు మహిళతో రామచంద్రరావు అత్యంత చనువుగా మాట్లాడారు. ఈ ఆడియో ఇప్పుడు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది.

ఆడియోలో ఉన్న సంభాషణలు:

మహిళ: ఏమైంది ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు?

డీజీపీ: జిమ్‍లో ఉన్నాను. 7 గంటలకు జిమ్‍కు వెళ్లాను. ఇప్పుడే వచ్చాను. జిమ్‍లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్‍లో ఉండదు.

మహిళ: రాత్రంతా నువ్వే గుర్తొస్తున్నావ్

డీజీపీ.. ఆ.. ఆ.. హా... అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిద్రనే రాలేదు. మరి ఇంటికి రానా ఇప్పుడు?

మహిళ: ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి..

సర్కార్ సీరియస్ యాక్షన్:

రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో కె.రామచంద్రరావుపై కర్ణాటక సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈఘటనపై విచారణ చేపట్టిన ప్రభుత్వం మంగళవారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.

Read More... ముద్దులు కౌగిలింతలతో IPS రాసలీలలు.. ఏకంగా ఆఫీస్‌‌నే బెడ్‌రూమ్‌గా మార్చి.. (వీడియో)

Next Story