ఆరేళ్ల తర్వాత సోనియాతో సీఎం భేటీ.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ..?

by Dishanational4 |
ఆరేళ్ల తర్వాత సోనియాతో సీఎం భేటీ.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌ సీఎం నితీష్ కుమార్ కీలక నేతలతో చేస్తున్న విస్తృత సంప్రదింపులు రాజకీయంగా ఆసక్తిగా మారింది. సీఎం ఇప్పటికే కీలక ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఈ జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, వామపక్ష నేతలు ఉన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్న క్రమంలోనే సోనియా గాంధీ కలనుండటం మరిన్ని చర్చలకు దారితీసింది.

అయితే సీఎం నితీష్ కుమార్, లాల్ ప్రసాద్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నట్లు సమాచారం. ఆరేళ్ల తర్వాత వీరి కలయిక ఇదే తొలిసారి కావడం విశేషం. 2015లో బీహార్ ఎన్నికలకు ముందు జరిగిన ఇఫ్తార్‌లో నితీష్ కుమార్, సోనియా గాంధీ చివరిసారిగా కలుసుకున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారని ఇద్దరు బీహార్ నేతలు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, నితీష్ కుమార్‌తో చేతులు కలుపుతారనే ఊహాగానాలకు తెర లేపింది.

Also Read : రాంగ్ రూట్‌.. కీలక సమయంలో దారితప్పిన రాహుల్ 'జోడో యాత్ర



Next Story