- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మశాల మార్కెట్లో విదేశీ పర్యాటకుడి వీరంగం.. మహిళా పోలీసుతో అసభ్య ప్రవర్తన!
మద్యం మత్తులో ఉన్న ఓ విదేశీ పర్యాటకుడు ధర్మశాలలో నానా హంగామా సృష్టించాడు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో బీభత్సం సృష్టించడంతో పాటు, విధుల్లో ఉన్న మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాలపాలయ్యాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో ఉన్న ఓ విదేశీ పర్యాటకుడు ధర్మశాలలో నానా హంగామా సృష్టించాడు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో బీభత్సం సృష్టించడంతో పాటు, విధుల్లో ఉన్న మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాలపాలయ్యాడు. జాతీయ మీడియా, వైరల్ వీడియో ప్రకారం.. ధర్మశాలలోని రద్దీ ప్రాంతమైన కొత్వాలీ బజార్ (కచేరి చౌక్) వద్ద ఓ విదేశీయుడు తాగి రోడ్డుపై హంగామా చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారుల వద్ద ఉన్న కూరగాయలను రోడ్డుపైకి విసిరేయడంతో పాటు, ఓ ట్యాక్సీపై రాళ్లు రువ్వి కారును ధ్వంసం చేశాడు.
పోలీసుతో దురుసు ప్రవర్తన..
స్థానికులు, వ్యాపారులు అతడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా వినకుండా తన వీరంగాన్ని కొనసాగించాడు. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ట్రాఫిక్ పోలీసుతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక, విదేశీయుడి ప్రవర్తనతో మార్కెట్‌లోని స్థానికులు, పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సదరు పర్యాటకుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
భద్రత పెంచాలని స్థానికుల డిమాండ్
నిత్యం రద్దీగా ఉండే ఈ వాణిజ్య ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంపై స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకులు, స్థానికులు భయాందోళనలకు గురి కాకుండా ఉండేందుకు మార్కెట్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ధర్మశాల ఏఎస్పీ బీర్ బహదూర్ స్పందిస్తూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతను ఎక్కడ బస చేశాడు? ఇతర పూర్తి వివరాలపై దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.






