తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పని : ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి తీసుకురాలేని సిగ్గులేని దద్దమ్మ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పని :  ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి
X

దిశ, ధర్మసాగర్ : తెలంగాణ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి తీసుకురాలేని సిగ్గులేని దద్దమ్మ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణలో కూడా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

గత 12ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధి కి బీజేపీ సహకరించలేదు

గత 12ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ప్రధాని మోడీకి, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల నిజంగా వివక్ష లేకుంటే వెంటనే కాజీపేట రైల్వే డివిజన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సిగ్గు లేని దద్దమ్మలుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ వీళ్లకు తెల్లారిలేస్తే ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే మంత్రి పదవులు ఇచ్చాడని ఏద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఒక్క ప్రాజెక్టు అయిన తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఇంకా సిగ్గులేకుండా బండి సంజయ్ 13లక్షల కోట్లు తెచ్చామని చెప్పడం సిగ్గు చేటనిఅన్నారు. 13లక్షల కోట్ల లెక్క ఏంటో, 13లక్షల కోట్లతో ఎ అభివృద్ధి పనులు చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న మీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయిన వచ్చిందా అని ప్రశ్నించారు.

కేటీఆర్ నీకు అసలు సిగ్గు ఉందా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ద్రోహి అని సంభోదించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు. అధికారం పోయిందనే అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ నీకు కొంచెం అయిన సిగ్గు ఉందా.... నీ స్వంత చెల్లె నీకు నాయకత్వ లక్షణాలు లేవని వదిలి వెళ్ళిందనీ అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల పరుష పదజాలం ఉపయోగించడం సరైంది కాదని వేల్లడించారు. కేటీఆర్ ఇప్పటికైనా బాష మార్చుకోవాలని లేదంటే నీకు అదే రీతిలో బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Next Story