- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు నాపై కాస్త ప్రేమ ఎక్కువే.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ కేటాయించినా మనస్ఫూర్తిగా పని చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తాము అధికారంలోకి రాగానే ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు లోబడే పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యూచర్ సిటీ రద్దు వంటి వ్యాఖ్యలు చేయడం సహజమేనని పొంగులేటి కొట్టిపారేశారు. అయితే, ఒకవేళ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే.. అక్కడ భూములు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేటీఆర్‌కు తనపై ప్రేమ ఎక్కువని.. అందుకే పదే పదే హగ్గింగ్ చేస్తుంటారని పొంగులేటి సెటైర్లు వేశారు.
భూముల ధరలపై స్పష్టత..
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో భూముల విలువ విపరీతంగా పెరుగుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ల్యాండ్ వ్యాల్యూ మాత్రమే పెంచుతున్నామని, ‘రిజిస్ట్రేషన్ వ్యాల్యూ’ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ గనుక పెంచితే.. భవిష్యత్తులో ప్రభుత్వం మళ్లీ భూసేకరణ (Land Acquisition) చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ (ACB) కేసులకు సంబంధించిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే ఏకంగా 3,500 పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసిందని వెల్లడించారు.
శాఖల మార్పుపై రియాక్షన్ ఇదే..
మంత్రుల శాఖల మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. తాను ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ కేటాయించినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ ఫైల్‌పైనా గుడ్డిగా సంతకం పెట్టలేదన్నారు. అంతా చట్టప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నానని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తనపై ప్రేమ ఎక్కువని, అందుకే పదే పదే తనను టార్గెట్ చేస్తూ 'హగ్గింగ్' (విమర్శల రూపంలో చుట్టుముట్టడం) చేస్తుంటారని పొంగులేటి సటైర్లు వేశారు.






