- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Burj Khalifa: బూర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ మిస్సైల్స్
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండోరోజు దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని సీఐఏ కేంద్రంపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అటు దోహాలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై సంయుక్త బలగాలు దాడులకు దిగాయి. మరోవైపు లెబనాన్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ బలగాలు దాడులు చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాపై టెహ్రాన్ దాడికి యత్నించింది. బూర్జ్ ఖలీఫా(Burj Khalifa) మీదుగా ఇరాన్ డ్రోన్లు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఈ దాడుల్లో బూర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో భవనంలోని ఓ అంతస్తు వద్ద మంటలు వచ్చి.. పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా దాని సమీపంలో దాడులు జరిగాయా అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.






