దుబాయ్ ఎయిర్ పోర్టుపై దాడి..భ‌యాందోళ‌న‌లో ప్ర‌యాణికులు

by velandi.Saikiran |   (  Updated:2026-03-01 11:59:49  IST  )

ఇరాన్ దాడుల నేప‌థ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది.

దుబాయ్ ఎయిర్ పోర్టుపై దాడి..భ‌యాందోళ‌న‌లో ప్ర‌యాణికులు
X

దిశ‌, వెబ్ న్యూస్‌: అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార చర్యకు దిగింది. వరుసగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగానే తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఓ క్షిప‌ణిని వదిలింది ఇరాన్. ఈ దెబ్బకు దుబాయ్ విమానాశ్రయంలోని రన్ వేలు, టెర్మినల్ పరిసరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న కొన్ని హోటల్స్ కూడా పూర్తిగా దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి.

దుబాయ్ విమానాశ్రయం మూసివేత

ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే దుబాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తూ ప్రకటన చేశారు. దుబాయ్ వైపు రావాల్సిన విమానాలను ఇతర ప్రాంతాలకు ఇప్పటికే తరలిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా దుబాయ్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. ఇందులో ఇండియన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Burj Khalifa: బూర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ మిస్సైల్స్

Next Story