ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు.. డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 10:42:03  IST  )

ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో అంతం కావచ్చని, 155 యుద్ధ విమానాలతో అమెరికా పైలట్‌ను రక్షించిన మెగా ఆపరేషన్ వివరాలను ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ ఇవాళ ఆయన మీడియాకు వెల్లడించారు.

ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు.. డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ (Iran)పై యుద్ధం, అమెరికా పైలట్ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి వైట్‌హౌస్ వేదికగా ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా.. ‘ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు.. ఆ ఒక్క రాత్రి ఈరోజే కావొచ్చు’ అంటూ యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు.

సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్

ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన అమెరికాకు చెందిన ఎఫ్-15 (F-15) ఫైటర్ జెట్ కూలిపోగా, అందులోని పైలట్‌ను రక్షించే ఆపరేషన్ ఉత్కంఠభరితంగా కొనసాగిందని ట్రంప్ తెలిపారు. ‘మేము మా పైలట్‌ను క్షేమంగా రక్షించుకోగలిగాం. గతంలో ఎన్నడూ లేని విధంగా, అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ విజయం సాధించాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా రక్షణ శాఖ (United States Department of Defense)లోని సమాచారం లీక్ కావడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమికి దగ్గరగా వచ్చిన జెట్ గురించి, అందులో ఒకరు దొరకడం.. మరొకరు గల్లంతైన విషయం గురించి ఎవరో దొంగచాటుగా లీక్ చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ లీక్ వల్ల రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారింది. మా పైలట్‌ను పట్టుకున్న వారికి ఇరాన్ ప్రభుత్వం బహుమతి కూడా ప్రకటించింది. మొదటి పైలట్‌తో దాదాపు గంట వరకు మాట్లాడలేకపోయినట్లు ట్రంప్ వివరించారు. ఈ సమాచారాన్ని బయటపెట్టిన అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని ఆయన హెచ్చరించారు.

ఒక్క పైలట్ కోసం 200 మంది సైనికులు.. 155 విమానాలు

ఒక్క అమెరికా సైనికుడి ప్రాణం కోసం తమ ప్రభుత్వం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ట్రంప్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌లు 155, 4 బాంబర్లు, 55 సాధారణ విమానాలు, 64 ఫైటర్ జెట్లు, 13 రెస్క్యూ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మరియు 48 ట్యాంకర్లు ఇలా ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఏకంగా 200 మంది ప్రత్యేక సైనికులు రంగంలోకి దిగారని పేర్కొన్నారు. సైన్యం ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత భారీ, సంక్లిష్టమైన ఆపరేషన్ ఇదేనని అన్నారు. ఈ ప్రమాదకరమైన గాలింపు చర్యల్లో మేము విజయం సాధించామని తెలిపారు. తమకు సహకరించిన గొప్ప వ్యక్తులందరికీ ధన్యవాదాలని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.

అమెరికాలో ‘కోవర్టు’ వేట.. జర్నలిస్టులకు ట్రంప్ జైలు హెచ్చరిక!

Next Story