Donald Trump: అమెరికాలో ‘కోవర్టు’ వేట.. జర్నలిస్టులకు ట్రంప్ జైలు హెచ్చరిక!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 02:31:46  IST  )

ఇరాన్ యుద్ధ సమయంలో రక్షణ రహస్యాలను లీక్ చేస్తున్న ‘కోవర్టు’ను పట్టుకునేందుక వేట ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Donald Trump: అమెరికాలో ‘కోవర్టు’ వేట.. జర్నలిస్టులకు ట్రంప్ జైలు హెచ్చరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌తో భీకర యుద్ధం కొనసాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలన విభాగంలో ఉంటూ అత్యంత కీలకమైన రక్షణ సమాచారాన్ని మీడియాకు చేరవేస్తున్న ‘కోవర్టు’ (Mole) కోసం గాలింపు మొదలుపెట్టినట్లుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఇవాళ వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 3న ఇరాన్‌లో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానానికి సంబంధించి ఒక రహస్య సమాచారం లీక్ అయిందని ట్రంప్ ఆరోపించారు. విమానంలోని రెండో అధికారి తప్పిపోయిన విషయం ఇరాన్ అధికారులకు తెలియక ముందే, అమెరికా మీడియాలో వార్త రావడం వల్ల ఆ అధికారిని పట్టుకోవడానికి ఇరాన్ రివార్డు ప్రకటించిందని, ఇది అమెరికా సైనికుడి ప్రాణాలను ప్రమాదంలో నెట్టిందని ట్రంప్ మండిపడ్డారు.

జర్నలిస్టులను నేరుగా జైలుకే పంపుతా..

జాతీయ భద్రతకు విఘాతం కలిగించే సమాచారాన్ని అందించిన వ్యక్తి పేరు చెప్పకపోతే, సదరు వార్తను రాసిన జర్నలిస్టును జైలుకు పంపుతామని ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నిజం చెప్పండి లేదా జైలుకు వెళ్లండి’ అంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఇక హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) వెంటనే తెరవాలని, లేని పక్షంలో ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ మంగళవారం రాత్రి వరకు గడువు విధించారు. దీనిని ఆయన ‘పవర్ ప్లాంట్ డే’, ‘బ్రిడ్జ్ డే’గా అభివర్ణించారు. యుద్ధం గురించి తప్పుడు వార్తలు లేదా వక్రీకరించిన సమాచారాన్ని ప్రసారం చేసే మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని ఎఫ్‌సీసీ (FCC) చైర్మన్ బ్రెండన్ కార్ కూడా హెచ్చరించారు.

ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు.. డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్

Next Story