బంగ్లాదేశ్ అల్లర్లు.. భారతీయులు బయటికి రావొద్దు : ఇండియన్ హైకమిషన్ హెచ్చరిక

by Muthe.Rajitha |   (  Updated:2025-12-19 05:35:54  IST  )

బంగ్లాదేశ్‌లో రేగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది.

బంగ్లాదేశ్ అల్లర్లు.. భారతీయులు బయటికి రావొద్దు : ఇండియన్ హైకమిషన్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో రేగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లా లోని ఇండియన్స్ కు భారత హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని అడ్వైజరీ విడుదల చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది మరణంతో అక్కడ మరోసారి తీవ్ర అల్లర్లు చెలరేగాయి. గురువారం రాత్రి నుంచి భారత్‌, అవామీలీగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు వీధుల్లోకి రావడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌.. అక్కడ నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఎమర్జెన్సీ సమయంలో హైకమిషన్‌, అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఈ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందిస్తూ.. అక్కడ పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని, బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది.


Read More..

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

Next Story