ఇండియా, ఫ్రాన్స్‌ మధ్య 20కి పైగా ఒప్పందాలు !

by velandi.Saikiran |   (  Updated:2026-02-18 10:23:41  IST  )

ఇండియా,ఫ్రాన్స్ మధ్య 20 ఒప్పందాలు జరిగాయి.వాణిజ్యం, రక్షణ రంగాల్లోసహకారాన్ని పెంచుకోవాలని నిర్ణ‌యించుకున్నారు.

ఇండియా, ఫ్రాన్స్‌ మధ్య 20కి పైగా ఒప్పందాలు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియా, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ( Emmanuel Macron), ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi) ఆహ్వానం మేరకు ఇండియాలో పర్యటించారు ఇమ్మానుయేల్ మాక్రాన్. దాదాపు మూడు రోజుల పాటు ఇండియాకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది మోడీ ప్రభుత్వం. ఇక ఇండియాలో అడుగుపెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇండియా అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా రెండు దేశాల మధ్య దాదాపు 20కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

ఇండియా, ఫ్రాన్స్ మధ్య 20కి పైగా ఒప్పందాలు !

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మోడీ సర్కార్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రఫెల్ యుద్ధ విమానాల నుంచి జలాంతర్గామి వరకు రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ మాక్రాన్ ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌ తో ఇండియా రక్షణ ఒప్పందాన్ని పదేళ్లకు పునరుద్ధరించేలా రెండు దేశాలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఈ ఒప్పందాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా, ఫ్రాన్స్ సహకారంతో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

డిజిటల్ సైన్స్, సాంకేతిక కేంద్రాన్ని, ఏరోనాటిక్స్ నైపుణ్యాలు పెంచడానికి జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. రక్షణ రంగంలో కూడా కీలక అడుగులు పడబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎయిర్ బస్, టాటా అధునాతన వ్యవస్థతో కలిసి హెచ్ 165 హెలికాప్టర్లను తయారు చేస్తామని మోడీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎత్తులో విహరించే హెలికాప్టర్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు విక్రయిస్తామని కూడా వెల్లడించారు.క్లిక్

పీఎం మోడీ మెచ్చిన స్వదేశీ ఏఐ గ్లాసెస్.. సర్వం కాజే

Next Story