పీఎం మోడీ మెచ్చిన స్వదేశీ ఏఐ గ్లాసెస్.. సర్వం కాజే

by Phanindra |   (  Updated:2026-02-18 10:24:34  IST  )

పీఎం మోడీ మెచ్చిన స్వదేశీ ఏఐ గ్లాసెస్ ‘సర్వం కాజే’ త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.

పీఎం మోడీ మెచ్చిన స్వదేశీ ఏఐ గ్లాసెస్.. సర్వం కాజే
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీ సరికొత్త గ్యాడ్జెట్‌తో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి స్వదేశీ డిజైన్, టెక్నాలజీతో ‘సర్వం కాజే’ పేరిట ఏఐ కళ్లద్దాలను తయారు చేసింది. ఏఐ సమ్మిట్‌కు వచ్చిన ప్రధాని మోడీ కూడా ఈ కళ్లద్దాలు చూసి ఆశ్చర్యపోయారు. వీటిని పెట్టుకొని ట్రై చేసిన ఆయన సర్వం సంస్థను మెచ్చుకున్నారు. మే నెలలో ఈ గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ కో-ఫౌండర్ ప్రత్యూష్ కుమార్ తెలిపారు. ‘మా మోడల్స్‌ను మీ చేతుల్లోకి తీసుకొచ్చే సర్వం కాజేను లాంచ్ చేస్తున్నాం. ఇవి 2026 మే నుంచి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి’ అని ఆయన ప్రకటించారు. అయితే వీటి ధర ఎంత? హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ఏంటి? బ్యాటరీ లైఫ్ ఎంత? ఏఐ రెస్పాన్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది? వంటి వివరాలను ఈ సంస్థ ఇంకా వెల్లడించలేదు. మే నెలలో అధికారికంగా ఈ కళ్లద్దాలు లాంచ్ చేసినప్పుడు ఈ వివరాలన్నీ వెల్లడించే అవకాశం ఉంది.

ఫీచర్స్ ఇవే..

సర్వం కాజే గ్లాసెస్ మన మాటలు విని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. మన ఆదేశాలకు తగ్గట్లు నడుచుకుంటుంది. అద్దాల్లో ఇన్‌-బిల్ట్‌గా ఉన్న కెమెరా సాయంతో ఫొటోలు తీస్తుంది. త్వరలోనే చాట్ ఫీచర్‌ను కూడా కళ్లద్దాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం ఏఐ ప్రయత్నిస్తోంది. అలాగే ప్రత్యేకంగా గ్లాసెస్ కోసం స్పెషల్ యాప్స్ తయారు చేయనుంది. సర్వం ఏఐ సంస్థ భారతీయ భాషల కోసం తయారు చేసిన ఏఐ మోడల్స్ ఆధారంగా కాజే కళ్లద్దాలు పనిచేస్తాయి. ఇప్పటికే మార్కెట్లో మెటా నుంచి వచ్చిన రే-బాన్ ఏఐ కళ్లద్దాలున్నాయి. కానీ అవి పూర్తిగా ఇంగ్లీష్ మీదనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ గ్యాప్‌ను ఫిల్ చేయాలని సర్వం ప్రయత్నిస్తున్నది.

ఇండియా, ఫ్రాన్స్‌ మధ్య 20కి పైగా ఒప్పందాలు !

Next Story