విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం: నిందితుడు అరెస్ట్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-18 04:43:02  IST  )

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ షాదరా సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం: నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ షాదరా సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. విస్తారాలో ఉద్యోగం పేరిట తనను మోసం చేశారంటూ రీతూ సింగ్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని ఘాజియాబాద్‌లోని ఆదిత్య వరల్డ్ సిటీలో గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని 35 ఏళ్ల రోహిత్ మిశ్రాగా గుర్తించారు. బాధితులను నమ్మించడం కోసం నిందితుడు "AIR VISTARA" పేరుతో లోగోను ఉపయోగిస్తూ వాట్సాప్ ప్రొఫైల్‌ను సృష్టించాడని పోలీసులు వెల్లడించారు.

నకిలీ నియామక పత్రాలు స్వాధీనం

నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, నకిలీ ఎల్ ఓఐ (Letter of Intent) పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసం వెనుక ఉన్న లోతైన కుట్రను, ఇతర సహచరులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు వాడిన బ్యాంక్ ఖాతాలను, నగదు లావాదేవీలను విశ్లేషిస్తున్నామని, ఈ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో తేల్చేందుకు డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read More..

స్కూల్ బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. తప్పిన ప్రమాదం..

Next Story