స్కూల్ బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. తప్పిన ప్రమాదం..

by Gugulothu.Kavitha |

అతివేగంగా డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన ఘటన రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్కూల్ బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. తప్పిన ప్రమాదం..
X

దిశ, ఘట్కేసర్: అతివేగంగా డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన ఘటన రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం విద్యార్థులను తీసుకొని పోచారం జోడిమెట్ల నుంచి నారపల్లి వైపు యూటర్న్ తీసుకుంటున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఘట్కేసర్ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ (ఏపీ 29 టిఏ 5266) అతివేగంగా వచ్చి ఢీకొంది. వ్యాన్ ఢీకొనడంతో స్కూల్ బస్సు హైదరాబాద్ వైపు తిరగబడింది. ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Next Story