వర్షాలు కురవాలని నంచర్లలో ‘కప్ప కావడి’ నిర్వహణ

by Jakkula.Mamatha |

వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో కప్ప కావడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

వర్షాలు కురవాలని నంచర్లలో ‘కప్ప కావడి’ నిర్వహణ
X

దిశ,మహమ్మదాబాద్: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో కప్ప కావడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వార్డులో కప్ప కావడిని ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామస్థులు నీళ్లు పోస్తూ వర్ష దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండి రైతులకు సాగునీటి కొరత లేకుండా మంచి దిగుబడులు రావాలని కోరుకున్నారు. గ్రామంలో సుభిక్షం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి, వార్డు సభ్యుడు మాధవులు, ఆర్టీసీ రవి, శావుకు అంజిలయ్య, డి. వెంకటేష్, బెస్త చెన్నయ్య, వి. చారి, ఎస్. శీను, జే. నవీన్ కుమార్, చెన్నయ్య, బోయ ఎస్. అంజి, పెంటయ్య, మున్నూరు శ్రీను, ఎం. గోపాల్, కే.బుడ్డయ్య, ఆటో అంజి, బాలయ్య, రాజు, ఈ. నవీన్ కుమార్, సి.నర్సింలు, బాలకృష్ణ, ఉషన్, శివతో పాటు గ్రామ యువకులు, మహిళలు, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Next Story