హర్మూజ్ జలసంధి వద్ద హైడ్రామా.. 17 భారత ఇంధన నౌకల రాకకు బ్రేక్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 10:38:24  IST  )

దేశంలో ఇంధన ధరలు పెరిగే ముప్పు పొంచి ఉంది. హర్మూజ్ జలసంధి వద్ద 17 భార‌త్‌కు చెందిన ఇంధన నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

హర్మూజ్ జలసంధి వద్ద హైడ్రామా.. 17 భారత ఇంధన నౌకల రాకకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ ఉద్రిక్తత కారణంగా భారత ఇంధన భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముడి చమురు (Crude Oil), ఎల్‌పీజీ (LPG), ఎల్‌ఎన్‌జీ (LNG) లోడ్‌తో భారత్ వైపు వస్తున్న 17 భారీ నౌకలు ప్రస్తుతం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో నిలిచిపోయాయి. నిలిచిపోయిన 17 నౌకల్లో ముడి చమురుతో పాటు వంట గ్యాస్, ప్రకృతి వాయువు (LNG) నిల్వలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌకలు ముందుకు కదలలేకపోతున్నాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిస్థితితులను నిశితంగా గమనిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లేదా ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచే అంశంపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ప్రపంచ చమురు సరఫరాలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే భారత్‌కు అవసరమైన మెజారిటీ ఇంధన దిగుమతులు జరుగుతాయి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని గతంలోనే హెచ్చరించడం, ప్రస్తుత దాడుల నేపథ్యంలో నౌకల రక్షణపై ఆందోళన నెలకొంది.

Good News: వలస కార్మికులకు తీపికబురు.. 5 KG ఉచిత సిలిండర్ల కోటా రెట్టింపు

Next Story