- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News: వలస కార్మికులకు తీపికబురు.. 5 KG ఉచిత సిలిండర్ల కోటా రెట్టింపు
వలస కార్మికుల కోసం 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోజువారీ కేటాయించే 5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల (Free Trade LPG cylinders) కోటాను రెట్టింపు చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. అయితే, ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వేళ 5 కేజీల బరువుండే ‘ఛోటూ’ (Chotu) సిలిండర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మేజర్ పట్టణాలు, టౌన్లలో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గ్యాస్ కనెక్షన్ల కోసం అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (Identity Proof) చూపిస్తే 5 కేజీల ‘ఛోటూ’ సిలిండర్‌ను సులభంగా పొందవచ్చు
కేటాయింపుల పెంపు..
రాష్ట్రాలకు అందించే అదనపు సిలిండర్ల సరఫరాను ఈ ఏడాది మార్చి 2 నుంచి 3 తేదీల్లో అందించిన సగటు సరఫరా ఆధారంగా లెక్కించనున్నారు. గతంలో నిర్ణయించిన 20 శాతం సీలింగ్‌కు అదనంగా ఈ సరఫరా ఉండనుంది. ఇరాన్ (Iran) యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడటం, వలస కార్మికులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ కొనాల్సిన అవసరం లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) ద్వారా ఈ అదనపు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని కేంద్రం సూచించింది.






