- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
POK లో భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 154 మంది మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు 24 గంటల్లోనే 154 మంది మరణించారు.

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు 24 గంటల్లోనే 154 మంది మరణించారు. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదల వల్ల అనేక ఇళ్ళు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్ళు, బ్రిడ్జిలు కొట్టుకు పోయాయి. ఎడతెరిపి లేని వానలు, భారీ వరదల వల్ల చిన్నపిల్లలతోసహా 125 మంది మరణించారు. POK లోని గిల్గిత్-బాల్టిస్థాన్ లో అనేక భవనాలు వరదల ధాటికి నామరూపాల్లేకుండా కొట్టుకు పోయాయి. స్థానికులు, సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
అయితే వరదల్లో వందల మంది కొట్టుకుపోవడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నందున అనేక ప్రాంతాల్లో వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక్క ఖైబర్ పంఖ్తుక్వా ప్రావిన్స్ లోనే వందకు పైగా మరణాలు నమోదైనట్టు సమాచారం. బునెర్లో 75 మంది, మన్సేహ్రా 17 మంది వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందినట్టు తెలుస్తోంది.






