హరివంశ్ నారాయణ్ సింగ్ హ్యాట్రిక్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నిక

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-17 08:16:57  IST  )

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్‌ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హరివంశ్ నారాయణ్ సింగ్ హ్యాట్రిక్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్‌ సింగ్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే (NDA) తరపున ఆయన పేరును కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులు ప్రతిపాదించగా, విపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రాజ్యసభ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు. హరివంశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా మూడోసారి.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు..

ఈ సందర్భంగా సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. హరివంశ్ నారాయణ్‌ సింగ్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. హరివంశ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, జర్నలిజం, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, నేడు మూడోసారి ఈ కీలక పదవిని చేపట్టడం అభినందనీయమన్నారు. సభను నిష్పక్షపాతంగా, హుందాగా నడపడంలో ఆయనకు ఉన్న నేర్పు సభకు అలంకారమని ప్రధాని కొనియాడారు. కేవలం అధికార పక్షమే కాకుండా, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇతర సభ్యులు కూడా హరివంశ్ నారాయణ్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సభా మర్యాదలను కాపాడుతూ, అందరినీ కలుపుకుని పోతారనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. హరివంశ్ నారాయణ్‌ సింగ్ ఎన్నికతో రాజ్యసభలో పాలక పక్షం తన పట్టును మరోసారి నిరూపించుకుంది.

మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులకు టీడీపీ మద్దతు : MP లావు

Next Story