లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నారా?.. అలా చేయకపోతే చిక్కుల్లో పడ్డట్టే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-13 16:01:26  IST  )

లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్(live-in Relationships) ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా అప్డేట్ అవుతున్నారు.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నారా?.. అలా చేయకపోతే చిక్కుల్లో పడ్డట్టే?
X

దిశ, వెబ్‌డెస్క్: లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్(live-in Relationships) ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా అప్డేట్ అవుతున్నారు. ఒకప్పుడు ఈ కల్చర్‌ను విదేశాల్లో చూసేవాళ్లం. కానీ.. ఇప్పుడు మన దేశంలో, మన నగరంలో కూడా ఈ కల్చర్ పెరిగిపోయింది. చాలా మంది పెళ్లికి ముందు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు. ఆ తర్వాత కొందరు పెళ్లి వరకూ వెళ్తుండగా.. మరికొందరు మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా.. లివ్-ఇన్‌లో ఉండాలనుకునే జంటకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం(Uttarakhand Govt) కీలక సూచనలు చేసింది. UCC నిబంధనల ప్రకారం లివ్-ఇన్‌లో ఉండాలనుకునే జంట 15 రకాల డాక్యుమెంట్లు సమర్పించాలని పేర్కొంది. అందులో ఆధార్ కార్డు, నివాస పత్రం, వయసు నిర్ధారణ వంటివి ఉన్నాయి. అలాగే ఒక ఆలయ పూజారి నుంచి కూడా ఎన్‌వోసీ(No Objection Certificate) తీసుకోవాలని నిబంధన పెట్టింది. 16 పేజీల దరఖాస్తు నింపి, రూ.500 ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని హెచ్చరించింది. లేదంటే ఆరు నెలల జైలు శిధించడం ఖాయమని పేర్కొంది. అంతేకాదు.. లివ్-ఇన్‌లో ఉన్నవారి వయసు 21 ఏళ్లకు తక్కువుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని స్పష్టంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరికీ సెట్ అవ్వకూడదు అనిపిస్తే ఈజీగా ఎవరి దారి వారు చూసుకోవచ్చు. వీరికి పెళ్లి కాలేదు కాబట్టి.. చట్టబద్ధంగా కట్టుబడి ఉండరు కాబట్టి.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. విడిపోవాలనే నిర్ణయం పెళ్లి తర్వాత తీసుకోవడం చాలా పెద్ద విషయం. ఇంకా.. పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవడం అతిపెద్ద అంశం. జీవితాలనే తారుమారు చేస్తుంది. కాబట్టి.. ఫ్యూచర్‌ను డిసైడ్ చేసుకొని.. కలిసుండాలా? విడిపోవాలా? అనేది నిర్ణయించుకోవడానికి లివ్ ఇన్‌లో ఈజీ ఆప్షన్ ఉంటుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌కే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే జంటలు ఇక నుంచి తమ సహజీవనంపై ఒప్పందం, రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని రాజస్థాన్‌ హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనికి సంబంధించిన విధానాన్ని అమలు చేయాలని జస్టిప్‌ అనూప్‌ కుమార్‌ దండ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read Also..

భాగస్వామి విడిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలిపే సంకేతాలు ఇవే!

Next Story