భాగస్వామి విడిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలిపే సంకేతాలు ఇవే!
రిలేషిప్ లేదా భార్య, భర్తల మధ్య నిత్యం పలు రకాల గొడవలు తలెత్తూనే ఉంటాయి. చాలా మంది వాటిని అర్థం చేసుకుని బంధాన్ని కొనసాగిస్తారు.
అయితే కొందరు మాత్రం చిన్న మనస్పర్థలకే విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. కానీ భాగస్వామితో ఎలా చెప్పాలో తెలియక బలవంతంగా కలిసి ఉంటారు. అయితే అలాంటి ఆలోచనలో మీ భాగస్వామిలో వచ్చాయని తెలుసుకునే సంకేతాలు ఇక్కడ తెలుసుకుందాం.
కొందరు భాగస్వామితో సమయం గడిపేటప్పుడు ఇష్టం లేకున్నా కానీ వారితో బలవంతంగా గడుపుతారు. అలాంటి వారు దూరం అవ్వాలని కోరుకునేవారే అలా చేస్తారట.
అలాగే తరచు చిరాకు పడటం చిన్న చిన్న వాటికే గొడవలు పడటం వంటివి చేస్తుంటారు. అలా చేస్తే వారు మీకు దూరం అవ్వాలనుకుంటున్నట్లేనట.
సాధారణంగా చాలా మంది ఇంచుమించు ఒకే ఇష్టాలను కలిగి ఉంటారు. ఎక్కువగా అలాంటి వారే పెళ్లి చేసుకుని దంపతులు అవుతారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇష్టాలు మారిపోతే కూడా పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
రిలేషన్ షిప్ లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంటే మీరు లేదా అవతల వ్యక్తి మిగతా వారికి ఎట్రాక్ అవుతున్నారని అర్థం. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కూడా భాగస్వామి అయిష్టతని చూపిస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా అతను మిమ్మల్ని దూరం చేస్తున్నారని గమనించాలి.
ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న మీ భాగస్వామి కనీసం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తుంటే వారు మీతో విడిపోవాలని భావిస్తున్నట్లు.
అయితే కొందరికి మీతో విడిపోవాలన్న ఆలోచన వచ్చాక అసలు మిమ్మల్ని పట్టించుకోరు. మీకు చాలా దూరంగా ఉంటుంటారు. ఇలాంటి ప్రవర్తన మీరు ముందుగానే గుర్తించాలి.