బంగారం, వెండిపై కేంద్రం బిగ్ షాక్.. దిగుమతి సుంకం రెట్టింపు !

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 09:59:14  IST  )

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

బంగారం, వెండిపై కేంద్రం బిగ్ షాక్.. దిగుమతి సుంకం రెట్టింపు !
X

దిశ‌, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు దేశ వ్యాప్తంగా క్రమ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర లక్షన్నరకు పైగా ఉంది. అటు వెండి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఏడాది కాలం పాటు బంగారం కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది.

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇప్పటి దాకా వీటిపై ఐదు శాతం ఉండగా, తాజాగా 10 శాతానికి సుంకాన్ని పెంచేశారు. పెరిగిన ఈ రెట్టింపు, నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందని అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది కేంద్రం. ఆభరణాల తయారీకి వాడే వస్తువులు, ఇతర లోహాలకు సంబంధించిన పారిశ్రామిక దిగుమతులకు కూడా ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ప‌శ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిధులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఈ చర్యను తీసుకున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగిపోనున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Next Story