- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుండి 15%కి పెంచడంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకం (Gold import duty) పెంపు నిర్ణయం.. సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో 6 శాతం ఉన్న మొత్తం సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు (Gold prices) ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల (10 గ్రాముల) ధర రూ. 13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.12,750 ఎగిసి రూ.1,53,900 పలుకుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పౌరులు తమ వంతు బాధ్యతగా అనవసరమైన విదేశీ కరెన్సీ వ్యయాన్ని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే సుంకాలు పెంచడం.. బంగారం ధరలు భారీగా పెరగడంతో బంగారం ప్రియులకు షాక్ తగిలింది.






