- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : టేకాఫ్ నుంచి క్రాష్ వరకు.. విమాన ప్రమాద మరో వీడియో
అహ్మదాబాద్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం(Boeing 787-8 Dreamliner Flight) టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది. ఎయిర్పోర్టు సీసీ ఫుటేజీ నుంచి కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తున్న ఈ వీడియోలో ఫ్లైట్ రన్ వే మీది నుంచి పైకి లేచిన కొద్ది సెకన్లలోనే జనావాసాలపై కుప్ప కూలినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read More : అంతా 8 నిమిషాల్లోనే.. విమానం క్రాష్ టైంలైన్ ఇదే..!






