- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా 8 నిమిషాల్లోనే.. విమానం క్రాష్ టైంలైన్ ఇదే..!
అంతా 8 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఎయిరిండియా విమానం క్రాష్‌కు ముందు ఏం జరిగిందంటే?

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. 242 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం.. టేకాఫ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నేలకూలింది. ఈ ప్రమాదంలో చాలామంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం.
13.30 గంటలకు: ఎయిరిండియా విమానం అప్పటికి ఇంకా బయలుదేరలేదు.
13.34 గంటలకు: విమానం నెమ్మదిగా టేకాఫ్ కోసం బయలుదేరింది. అప్పుడు విమాన వేగం 10 నాట్స్.
13.38 గంటలకు: సడెన్‌గా 174 నాట్స్ వేగానికి చేరుకున్న విమానం టేకాఫ్ అయ్యి 625 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత విమానం సిగ్నల్ కోల్పోయింది..
ఈ విమానం ఎదుకు కూలిందనే కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు. కొందరు టర్బయిన్‌లో పక్షి పడటంతో విమానం వేగం కోల్పోయిందని, దీని వల్లనే క్రాష్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరికొందరేమో మెకానికల్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చంటున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిగే వరకు ఏ విషయం చెప్పలేమని అధికారులు అంటున్నారు.






