- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పుల షాపులో ఘోర అగ్నిప్రమాదం.. అన్నా, చెల్లెలు సహా నలుగురు మృతి
శ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని టిగ్రి ఎక్స్ టెన్షన్లోని చెప్పుల దుకాణంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో అన్నా, చెల్లెలు సహా నలుగురు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రమాదంలో ఒక మహిళ సహా ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగినట్లు సాయంత్రం 6.24 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందని, వెంటనే తమతో పాటు ఫైర్ సిబ్బందిని తీసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో.. వాటిని అదుపుచేసేందుకు సుమారు 5 గంటల సమయం పట్టినట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో మరణించినవారిలో భవనం యజమాని జిమ్మీ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించామని మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయపడినవారిలో ఒకరిని మమత (40)గా గుర్తించారు. 25 శాతం కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులువెల్లడించారు. క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ టీమ్స్ స్పాట్ కు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారని, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More... పొద్దు పొద్దున్నే ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు






