- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొమ్మల దుకాణంలో షార్ట్ సర్క్యూట్... కాలిపోయిన షాపులు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బొమ్మల దుకాణాలు దగ్ధమైన సంఘటన మండలంలోని కొండగట్టులో అర్ధరాత్రి ప్రాంతంలో చోటుచేసుకుంది.

దిశ, మల్యాల : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బొమ్మల దుకాణాలు దగ్ధమైన సంఘటన మండలంలోని కొండగట్టులో అర్ధరాత్రి ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సుమారుగా 30 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి దుకాణాలు మూసివేసి పడుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి.
ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డు పై చేరారు. బాధితులు కళ్ళముందే తమ షాపులు కాలి బూడిదవడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ ఇంజన్ సమయానికి రాకపోవడంతో అధిక మొత్తం ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. షాప్ పైనే జీవనం సాగిస్తున్నామని, షాప్స్ కాలిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Read More... పొద్దు పొద్దున్నే ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు






