- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొద్దు పొద్దున్నే ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ బోథ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లు, మరి కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటన తీరు తెలుసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానికులు, పోలీసులు కలిసి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






