- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో కానిస్టేబుల్ సస్పెన్షన్
ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

దిశ, నల్లగొండ క్రైం : ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఈ నెల 17న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం అతడిని జైలుకు తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కానిస్టేబుల్ సత్యనారాయణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.






