- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డూప్లికేట్ నంబర్ ప్లేట్‌తో మోసం.. కేసు నమోదు
డూప్లికేట్ నంబర్ ప్లేట్‌గా ఉపయోగించి ట్రాఫిక్ చలాన్లు, ఫాస్టాగ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మేడిపల్లి పి.&టి. కాలనీకి చెందిన జల్లి చంద్రమౌళి (54) మెడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ,మేడిపల్లి: తన కారుకు చెందిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మరో వాహనానికి డూప్లికేట్ నంబర్ ప్లేట్‌గా ఉపయోగించి ట్రాఫిక్ చలాన్లు, ఫాస్టాగ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మేడిపల్లి పి.&టి. కాలనీకి చెందిన జల్లి చంద్రమౌళి (54) మెడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, తన భార్య ప్రేమలత పేరుపై నమోదైన TS08HT9728 నంబర్ గల 2021 మోడల్ రెనాల్ట్ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మరో వాహనానికి అక్రమంగా అమర్చడంతో గత ఏడాది కాలంగా తమకు సంబంధం లేని ట్రాఫిక్ ఈ-చలాన్లు, ఫాస్టాగ్ నోటీసులు వస్తున్నాయని తెలిపారు. 2025 జూన్ 7న కూడా తమ వాహనం ప్రయాణించని మార్గానికి సంబంధించిన ఫాస్టాగ్ చలాన్ అందినట్లు పేర్కొన్నారు.కోర్టు నుంచి వచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డూప్లికేట్ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న వాహనం, నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.






