చౌటుప్పల్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం

by Ratna Kumari |

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన గుణగాటి మల్సూర్ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చౌటుప్పల్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన గుణగాటి మల్సూర్ (45) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన మల్సూర్ ప్రస్తుతం చౌటుప్పల్‌లో నివాసం ఉంటూ కూకట్‌పల్లిలోని ఎంఎస్‌ఎన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. బంధువులు, కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య రాధిక సోమవారం సాయంత్రం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు.

Next Story