- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tiger Woods: ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు నమోదు.. గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్
ఫ్లోరిడాలోని జూపిటర్ ఐలాండ్ సమీపంలో ప్రముఖ గోల్ఫ్ లెజెండ్ టైగర్ వుడ్స్ కారు ప్రమాదంలో గాయపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: గోల్ఫ్ ప్రపంచ దిగ్గజం టైగర్ వుడ్స్ (Tiger Woods)ను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో, డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ (Driving Under the Influence) కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జూపిటర్ ఐలాండ్‌లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్‌టేక్ క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ (Martin County) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మూత్ర పరీక్ష (Urine Test)కు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ (DUI) కేసు నమోదు చేసి మార్టిన్ కౌంటీ జైలుకు తరలించారు. కాగా, గతంలో కూడా టైగర్ వుడ్స్ ఇలాంటి కారు ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొంటారా లేదా అనే సందిగ్ధంలో ఉన్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం క్రీడా రంగంలో చర్చనీయాంశంగా మారింది.
Read More : నేపాల్‌లో అనూహ్య పరిణామం.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టు






