నేపాల్‌లో అనూహ్య పరిణామం.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-28 15:30:54  IST  )

నేపాల్ కొత్త ప్రధానిగా బాలేన్ షా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్ట్ చేశారు.

నేపాల్‌లో అనూహ్య పరిణామం.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ (Nepal) పాలిటిక్స్‌లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ (CPN-UML) అధినేత కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ (Ramesh Lekhak)ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అయితే, గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ‘జెన్-జెడ్’ (Gen Z) నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించి వీరిపై చర్యలు తీసుకున్నారు. ఆ నిరసనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 19 మంది యువకులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. తాజాగా, ఈ ఘటనపై విచారణ జరిపిన ‘గౌరీ బహదూర్ కార్కీ కమిషన్’ (Gauri Bahadur Karki Commission), అప్పటి ప్రధాని ఓలీ, హోంమంత్రి రమేష్ లేఖక్‌లు హింసకు కారకులని తేల్చింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఇవాళ వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదో రాజకీయ కుట్ర.. మాజీ ప్రధాని కేపీ శర్మ అరెస్ట్‌పై స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్

Next Story