భారత్‌కు చమురు సరఫరాలో ఆటంకం రానివ్వం.. రష్యా కీలక హామీ

by Prasad Jukanti |   (  Updated:2026-05-13 12:24:52  IST  )

భారత్‌కు ఇంధన సరఫరాపై రష్యా కీలక హామీ ఇచ్చింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా సరఫరాకు ఆటంకం కలగదని ఆ దేశ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.

భారత్‌కు చమురు సరఫరాలో ఆటంకం రానివ్వం.. రష్యా కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో అనిశ్చితి పరిస్థితుల కారణంగా చమురు దిగుమతుల విషయంలో రష్యా కీలక హామీ ఇచ్చింది. రష్యా (Russia) ఇంధన సరఫరాల్లో భారత్ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను తట్టుకుని మరీ భారత్‍కు స్థిరంగా ఇంధన సరఫరా చేసేందు రష్యా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశం నిమిత్తం భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఓ మీడియాతో మాట్లాడిన సెర్గీ లవ్రోవ్ భారత ఇంధన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని, చమరు సరఫరాకు ఆటంకం రానివ్వబోమని హామీ ఇచ్చారు. కాగా దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని స్వయంగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేసిన వేళ రష్యా నుంచి ఈ భరోసా మరోసారి రావడం ఆసక్తిగా మారింది.

భారత్‍కు తెలుసనుకుంటున్న:

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా తన భాగస్వామ్య దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందని ఈ సందర్భంగా సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఇదే క్రమంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంధన మార్గాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్లోబల్ ఎనర్జీ కారిడార్‍లపై ఆధిపత్యం చెలాయించడానికే అమెరికా రష్యాతో ఇంధన సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి తీసుకువస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమైన అన్ని ఇంధన మార్గాలను స్వాధీనం చేసుకోవడమే అమెరికా లక్ష్యం అని.. ప్రస్తుతం ఏం జరుగుతుందో భారత్ కు అవగాహన ఉందని నమ్ముతున్నానన్నారు. రష్యా ఇంధన సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న పాశ్చాత్య దేశాలను ముఖ్యంగా యూరప్ కంట్రీస్ ను ఆయన విమర్శఇంచారు.

ఇంధన ఆదా దిశగా ప్రధాని అడుగులు.. సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

Next Story