- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన ఆదా దిశగా ప్రధాని అడుగులు.. సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం
ఇంధన ఆదా కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని SPGకి ఆదేశం.

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో నెలకొన్న పరిస్థితుల పై ప్రధాని మోడీ (Prime Minister Modi) హైదరాబాద్ వేదికగా భారత ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇంధన పొదుపు (Fuel economy)ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తన భద్రతా కాన్వాయ్‌లోని (Security convoy) వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ఆయన ఎస్పీజీ (SPG) అధికారులను ఆదేశించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆచరణలో తాను కూడా ముందుండాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త నిర్ణయం ప్రకారం, కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గించడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని కూడా పెంచాలని ప్రధాని సూచించారు. అయితే, దీని కోసం అదనపు ఖర్చు చేయకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులనే సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రధాని భద్రతకు సంబంధించిన 'బ్లూ బుక్' ప్రోటోకాల్స్‌కు ఎక్కడా ఆటంకం కలగకుండానే SPG ఈ మార్పులను చేపడుతోందని, ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులకు కూడా పొదుపు దిశగా ఒక బలమైన సంకేతాన్ని పంపినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు.






