ధర్మస్థలంపై అసత్య ప్రచారం.. ED దర్యాప్తు చేయాలని అమిత్ షా కు లేఖ రాసిన ఉడిపి ఎంపీ

by Malleboina Mahesh |   (  Updated:2025-08-25 14:05:13  IST  )

ధర్మస్థలంపై అసత్య వార్తలను వ్యాప్తి చేసిన యూట్యూబర్లు, వారి వెనుక ఉన్న వ్యక్తులు, వారికి వచ్చిన నిధులపై ED దర్యాప్తు చేయాలని కోరుతూ ఉడిపి ఎంపీ కోట శ్రీనివాస్ పూజారి హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

ధర్మస్థలంపై అసత్య ప్రచారం.. ED దర్యాప్తు చేయాలని అమిత్ షా కు లేఖ రాసిన ఉడిపి ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని ధర్మస్థలం వివాదం (Dharmasthalam controversy) మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో అందులో పని చేసిన శానిటరీ వర్కర్.. తాను పదుల సంఖ్యలో మహిళా మృతదేహాలను పూడ్చి పెట్టానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ధర్మస్థల వివాదం పై సిట్ ఏర్పాటు చేసింది. అయితే నెల రోజుల పాటు తవ్వకాలు జరిపిన తర్వాత అనుమానాస్పదంగా ఎటువంటి మృతదేహాలు, అవశేషాలు లభించకపోవడంతో పోలీసులు ఫిర్యాదుదారుడిపై చీటింగ్ కేసు (case of cheating) పెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు విచారణలో కొంతమంది కావాలనే తనతో ఇలా చెప్పించారని ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సంచలన ఘటన సమయంలో తవ్వకాలు జరిపే క్రమంలో పదుల సంఖ్యలో మహిళ మృతదేహాలు భయటపడ్డాయని కొన్ని న్యూస్ ఛానెల్లతో పాటు యూట్యూబ్ ఛానల్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ప్రస్తుతం ఆ ఛానల్స్ చూపించినవన్ని అబద్దాలే అని తేలింది. ఈ క్రమంలో ధర్మస్థలంపై దుర్మార్గపు వార్తలను వ్యాప్తి చేయడంలో పాల్గొన్న యూట్యూబర్లు, వ్యక్తుల వెనుక ఉన్న నిధులపై ED దర్యాప్తు (ED investigation) చేయాలని కోరుతూ ఉడిపి ఎంపీ కోట శ్రీనివాస్ పూజారి (Udupi MP Kota Srinivas Pujari) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah)కు లేఖ రాశారు. దీంతో న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ, ఆల్ట్ న్యూస్ మీడియా సంస్థలపై అధికారులు నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై పలువురు కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు సమాచారం అందుతుంది.

Read More..

కర్ణాటక ధర్మస్థలి కేసులో సంచలన పరిణామం

Next Story