- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక ధర్మస్థలి కేసులో సంచలన పరిణామం
సంచలన ధర్మస్థలి కేసులో సిట్ అధికారులు ఈ సమాచారం ఇచ్చిన మాజీ శానిటరీ వర్కర్ ను అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ధర్మస్థలి కేసు (Dharmasthali case) దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ధర్మస్థలిలో కొద్ది సంవత్సరాల క్రితం శానిటరీ వర్కర్ (Sanitary worker)గా పనిచేసిన వ్యక్తి తాను పదుల సంఖ్యలో మహిళా మృతదేహాల (Female corpses)ను పాతిపెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్రమత్తం అయిన అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ షాకింగ్ ఫిర్యాదుపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka) ఈ కేసును విచారించేందకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team)ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్ దాదాపు నెల రోజుల పాటు ధర్మస్థలి లోని నేత్రావతి నది (Netravati river) ఒడ్డున, వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపింది.
అయితే శానిటరీ వర్కర్ చెప్పిన వివరాలతో తవ్వకాలు చేసిన సిట్ అధికారుల (SIT officials)కు ఎటువంటి అవశేశాలు లభించలేదు. దీంతో సిట్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మాజీ శానిటరీ వర్కర్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను తాను 1995-2014 మధ్యలో మహిళల శవాలను తానే పూడ్చానని పోలీసులకు ఇచ్చిన సమాచారంలో తెలిపాడు. అయితే అతని భార్య మాత్రం తన భర్తతో ఎవరో కొందరు కావాలనే ఈ అబాద్ధాలాడిస్తున్నారని పోలీసులు చెప్పింది. దీంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం అందుతుంది.






