బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ మరో కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-28 12:49:12  IST  )

మహారాష్ట్ర బారామతిలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ మరో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర బారామతిలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందగా.. బారామతి ప్రభుత్వ ఆస్పత్రిలోనే వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. తాజాగా.. డీజీసీఏ విమాన ప్రమాదంపై మరో ప్రకటన చేసింది. విమానం ప్రమాదానికి గురయ్యే సమయంలో పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని వెల్లడించింది. రన్ వే ను గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడినట్లు తెలిపింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు తొలి ప్రయత్నంలో రన్ వే కనిపించకపోవడంతో గాల్లోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టిందని, రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమైందని పేర్కొంది.

MORE NEWS : తునాతునకలైన డెడ్ బాడీలు.. . అజిత్‌ పవార్‌ను ఎలా గుర్తుపట్టారంటే?

Next Story