తునాతునకలైన డెడ్ బాడీలు.. . అజిత్‌ పవార్‌ను ఎలా గుర్తుపట్టారంటే?

by Prasad Jukanti |   (  Updated:2026-01-28 12:46:58  IST  )

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తునాతునకలైన డెడ్ బాడీలు.. . అజిత్‌ పవార్‌ను ఎలా గుర్తుపట్టారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర విషాదం నింపిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అజిత్ పవార్‍ను బలి తీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ ఉదయం బారామతి వద్ద జరిగిన ఫ్లైట్ క్రాష్ ల్యాండ్‍లో అజిత్ పవార్‍తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉన్నట్టుండి నియంత్రణ కోల్పోయిన విమానం ఒక్కసారిగా నేలను తాకింది. ఈ ఘటనలో భారీ పేలుడు శబ్దం వచ్చి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఇందులో ప్రయాణిస్తున్న వారి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ప్రమాదం సంభవించగానే స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నా మంటల ధాటికి దగ్గరకు కూడా చేరుకోలేకపోయామని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు రెండు మృతదేహాలు బయటకు ఎగిసిపడగా అందులో చేతి వాచీ, గాగుల్స్ ను చూసి చనిపోయింది డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అని గుర్తించి బయటకు లాగామని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. మరో వైపు ప్రమాదం సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్‌ రాలేదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) వర్గాలు వెల్లడించాయి.

MORE NEWS : బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ మరో కీలక ప్రకటన

Next Story