- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ నుండి విజయ్ వరకు.. మొదటి ఎన్నికల్లో నటులకు వచ్చిన ఓటు షేరింగ్ వివరాలు
రాజకీయాల్లోకి వచ్చిన నటుల మొదటి ఎన్నికల ఓట్ల శాతాలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీరామారావు మొదటి ఎన్నికల్లోనే 46.0 శాతం ఓటు షేరింగ్ రాబట్టి అధికారంలోకి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అలా చేసినవారిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ఎక్కువగా సినిమాల ప్రభావం రాజకీయాలపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా తమిళనాట విడుదలైన ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 7న విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. విజయ్ కి మొదటి ఎన్నికల్లోనే తమిళనాట 34.92 శాతం ఓటు షేరింగ్ తో అధికారం సైతం దక్కింది. దీంతో గతంలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన నటుల మొదటి ఎన్నికల ఓట్ల శాతాలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీరామారావు మొదటి ఎన్నికల్లోనే 46.0 శాతం ఓటు షేరింగ్ రాబట్టి అధికారంలోకి వచ్చారు. తమిళనాట ఎంజీఆర్ మొదటి ఎన్నికల్లో 30.37 శాతం ఓటు షేరింగ్ రాబట్టారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించగా మొదటిసారి ఎన్నికల్లో ఆ పార్టీకి 16.32 శాతం ఓటు షేరింగ్ వచ్చింది. తమిళనాట హీరో విజయ్ కాంత్ డీఎండీకే పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయగా 8.38 శాతం ఓటు షేరింగ్ సాధించారు. ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో మొదటిసారి ఎన్నికల బరిలో నిలవగా 5.53 శాతం ఓటు షేరింగ్ రాబట్టారు. తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించి మొదటిసారి బరిలో నిలవగా 2.52 శాతం ఓటు షేరింగ్ వచ్చింది.






