పోషకాహారం ప్యాకెట్లో పాము పిల్ల.. షాకైన గర్భిణి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-07 12:44:56  IST  )

గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు దేశంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి.

పోషకాహారం ప్యాకెట్లో పాము పిల్ల.. షాకైన గర్భిణి
X

దిశ, వెబ్‌డెస్క్: గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు దేశంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. అయితే ఓ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీకి అందజేసిన పోషకాహారం ప్యాకెట్లో పాము పిల్ల కనిపించింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ లోని పాంధుర్ణాజిల్లా కర్ఘాట్ కామతీ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గర్భిణీ.. అంగన్వాడీ కేంద్రంలో కొన్ని పోషక ఆహార ప్యాకెట్లు తీసుకుంది.

ఇంటికి వెళ్లి ఆ ప్యాకెట్లను ఓపెన్ చేసి చూడగా.. కనిపోయిన పాముపిల్ల కనిపించింది. అది చూసిన గర్భిణీ, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో అంగన్వాడీ సిబ్బంది, ఉన్నతాధికారులపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ దృష్టికి చేరడంతో.. సంబంధిత అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు స్థానిక అంగన్వాడీకి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆహార ప్యాకెట్ నమూనాలను టెస్టింగ్ కు పంపామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

వినియోగదారులకు గుడ్ న్యూస్.. వంటనూనెల ప్యాకేజింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

Next Story