- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ? TVKకు మద్దతు!
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించిన దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించిన దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK)కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్దతుకు ప్రతిఫలంగా కొత్త ప్రభుత్వంలో రెండు క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు, మరికొన్ని కీలక బోర్డుల చైర్మన్ పదవులను కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
గవర్నర్‌తో విజయ్ భేటీ.. రేపు ప్రమాణస్వీకారం!
‘ఇండియా టుడే’ నివేదికల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గిరిష్ చండోకర్ నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో టీవీకేకు మద్దతుపై కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకేకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 113కి చేరుతుంది. మిగతా ఐదుగురి కోసం వీసీకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ వంటి చిన్న పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు విజయ్ నేడు గవర్నర్‌ను కలవనున్నారు. రేపు (మే 7న) ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్‌వి వెన్నుపోటు రాజకీయాలు: డీఎంకే
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ నాయకులు వెన్నుపోటుదారులుగా వ్యవహరించారని, ఈ ఏకపక్ష నిర్ణయానికి తమ మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.






