Cockroach Party : భారత్‌నే కాదు.. పాక్‌ను కూడా షేక్ చేస్తున్న కాక్రోచ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-22 08:26:30  IST  )

ప్రస్తుతం భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్ స్టా పేజీ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లు దాటేసింది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీల అధికారిక ఫాలోవర్ల ఖాతాలను దాటేసింది.

Cockroach  Party : భారత్‌నే కాదు.. పాక్‌ను కూడా షేక్ చేస్తున్న కాక్రోచ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్ స్టా పేజీ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లు దాటేసింది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీల అధికారిక ఫాలోవర్ల ఖాతాలను దాటేసింది. గంటగంటలకు కాక్రోచ్ పార్టీ ఇన్ స్టా పేజీ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ట్విట్టర్ లోనూ ఫాలోవర్లు పెరుగున్న సమయంలో ఆ పేజీని పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీకి భయపడే ఆ పార్టీ పేజీని బీజేపీ డిలీట్ చేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.

తమకు భయపడే ట్విట్టర్ పేజీని లేకుండా చేశారని కాక్రోచ్ పార్టీ క్రియేటర్లు సైతం చెబుతున్నారు. ఫాలో వర్ల సంఖ్య పెరగడం జెన్ జీ సత్తా చూపించిందని అంటున్నారు. ఇక కేవలం ఇండియాలోనేకాకుండా ఇతర దేశాలకు సైతం కాక్రోచ్ ట్రెండ్ విస్తరిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ స్పూర్తితో పాకిస్థాన్ లో కాక్రోచ్ అవామీ పార్టీ పుట్టుకువచ్చింది. అంతేకుండా కాక్రోచ్ అవామీ లీగ్ అంటూ మరో గ్రూపు కూడా కనిపిస్తోంది. పాక్ లో చాలా కాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సరైన పాలన లేక, భారీగా పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలోనే అక్కడ కాక్రోచ్ ట్రెండ్ కు మద్దతు పెరుతున్నట్టు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో సరికొత్త పోరు: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ Vs ‘హిట్ జనతా పార్టీ’

Next Story